Dal: మీరెప్పుడైనా పప్పు ఉడుకుతున్నప్పుడు పైన నురగ రావడం గమనించారా? ఇలా ఎందుకు అవుతుంది? అలా పప్పుపై నురగ రావడం మంచిదేనా? పప్పు ఉడకబెతున్నప్పుడు అలా నురగరావడానికి కారణం.. అందులో ఉండే ప్రొటీన్, గంజి. అంతేకానీ అదేదో టాక్సిన్ అన్నట్లు కాదు. అయితే… ఆ నురగ కూడా ఎక్కువగా వస్తోందంటే అప్పుడు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే అలా నురగ ఎక్కువగా వస్తే పప్పు చేదుగా అయిపోతుంది. తిన్నా కూడా విరేచనాలు పట్టుకుంటాయి. కడుపు లాగేస్తూ ఉంటుంది.
మరి నురగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పప్పుని వెంటనే కడిసేసి పొయ్యిపై పెట్టకుండా ఒక 40 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టేసి మళ్లీ నీళ్లు పోసి ఉడకబెట్టండి. దీని వల్ల పప్పులో ఏదన్నా దుమ్ము ఉన్నా.. గంజి లెవెల్ ఎక్కువగా ఉన్నా పోతుంది. తిన్నా కూడా కడుపు ఉబ్బరం అనిపించదు. పప్పును ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వచ్చేలా ఉడకబెట్టడమే బెటర్ అని వైద్యులు చెప్తున్నారు.





