YSRCP TDP: ఎవరు అధికారంలో ఉన్నా.. పార్టీ ఏదైనా… కక్ష రాజకీయాలు కొత్తేం కాదు. ఒక పార్టీ మంచిది.. ఈ పార్టీ చెడ్డది అనడానికి లేదు. అందరూ ఒకలాగే ఉన్నారు. కాకపోతే ప్రజలకు ఇవన్నీ అనవసరం. ప్రజలకు మంచి చేసే వారు.. పథకాలు ఇచ్చేవారు.. వీళ్లే కావాలి. నిజమే కదా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.
కూటమిలో సింహభాగం తెలుగు దేశం పార్టీదే. అందులో ఎలాంటి సందేహం లేదు. అదీకాకుండా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను మెల్లిగా బొక్కలో వేస్తున్నారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తప్పు చేసారా లేక లోకేషే తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారా అన్న విషయం పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే ఈ అరెస్ట్‌లు అప్పుడు కూడా ఉంటాయి కదా..! ఇప్పుడూ… మా ఊరు మీ ఊరుకు ఎంత దూరమో మీ ఊరు మారికి అంతే దూరం ఉంటుంది కదా?
ఈ విషయాన్ని తెలుగు దేశంలోని కొందరు నాయకులు ముందే ఊహించి.. ఇప్పటినుంచే కాస్త జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. అదెలాగంటే.. కొందరు తెలుగు దేశం పార్టీ నేతలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నారట. కూటమి పాలన అధికారంలో ఉన్నప్పటికీ నడిపించేది.. మాట్లాడించేది అంతా కూడా నారా లోకేషే అని.. ఈ అరెస్ట్‌ల విషయంలో కానీ.. తప్పుడు కూతలు కూసే విషయంలో కానీ తమ సొంత ప్రమేయం ఏమీ లేదన్న విషయాన్ని జగన్‌కు చేరవేయాలని సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారట. అంటే.. వణుకు మొదలైనట్లే కదా..!





