2025 Movie Of The Year: ఈ సంవత్సరం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్‌లో చిన్న సినిమాలు సత్తా చాటాయి. బాలీవుడ్‌లో సినిమా ఆఫ్ ది ఇయర్‌గా దురంధర్ నిలిచింది. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. హాలీవుడ్‌లో అవతార్ యాష్ అండ్ ఫైర్, F1 సినిమాలు మంచి ఆదరణ పొందాయి. వీటన్నింటినీ తలదన్ని సినిమా ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఏకైక చిత్రం ఏదో తెలుసా?
Ne Zha 2. ఇది ఒక చైనీస్ యానిమేటెడ్ మూవీ. రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీస్తే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.18000 కోట్లు. దీని తర్వాత స్థానంలో జూటోపియా 2 ఉంది. మూడో స్థానంలో లిలో & స్టిచ్, నాలుగో స్థానంలో ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ నిలిచాయి. చైనాకి చెందిన మైథలాజికెల్ పాత్ర అయిన Ne Zha అనే ఓ బాలుడి కథ ఆధారంగా తీసారు. 2019లో వచ్చిన Ne Zha సినిమాకు Ne Zha 2 సీక్వెల్‌గా వచ్చింది.
ఈ సినిమా కథేంటంటే.. Ne Zha అనే బాలుడికి కొన్ని పవర్స్ ఉంటాయి. కానీ అతనికి మనుషులంటే భయం. తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలనుకుంటాడు. ఫస్ట్ పార్ట్‌లో Ne Zha చనిపోతాడు. పార్ట్ 2 లో అతని ఆత్మ తిరిగి వస్తుంది. కాకపోతే ఆ ఆత్మకు ఒక శరీరం కావాలి. దానిని పొందాలంటే కీలకమైన శక్తులు కావాలి. అలా Ne Zha బతికి రావడంతో అతని కంటే బలమైన శత్రువులు ఎదురై అంతమొందించాలనుకుంటారు. Ne Zha వారి నుంచి తప్పించుకుని తన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకుంటాడు అనేదే సినిమా కథ. ఈ ఏడాది జనవరిలో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నప్పటికీ కొనుగోలు చేసి చూడాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసారు.





