దర్శకుడు మారుతి షాకింగ్ కామెంట్స్
ఫ్యాన్స్ ఆగ్రహం
Raja Saab: సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినిమా వాళ్లు ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. వారు ఏవన్నా అభిప్రాయాలు వ్యక్తపరిచే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మొన్న నటుడు శివాజీ ఆడవారి దుస్తుల విషయంపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారానికి దారి తీసాయో తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే.. ఏదన్నా సినిమా రిలీజ్‌కి ముందు ఆ సినిమా హీరో, హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాత, సహ నటులు ఇలా ఆ సినిమాకు సంబంధించిన ఎవరైనా సరే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎందుకంటే సినిమా రిలీజ్‌కి ముందు వారు మాట్లాడే మాటలను బట్టే ప్రక్షకులు సినిమా చూడాలా లేదా అని ఆలోచిస్తారు. ఈ విషయంలో దర్శకుడు మారుతి ఇరుక్కున్నారనే చెప్పాలి. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ఇటీవల గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. అయితే.. మారుతి ఎమోషనల్ అవుతూ ప్రభాస్ గురించి పలు వ్యాఖ్యలు చేసారు. ఆయన అంతా పాజిటివ్‌గా మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ మధ్యలో బాహుబలి టాపిక్ తెచ్చి ఇప్పుడు ఫ్యాన్స్ నోళ్లలో నానుతున్నారు.
ఇంతకీ మారుతి ఏమన్నారంటే.. ఆయన ఓసారి దక్షిణాఫ్రికాకి వెళ్లినప్పుడు అక్కడి జనాలతో మాట్లాడుతూ మీకు ప్రభాస్ తెలుసా అని అడిగారట. అప్పుడు వారు హా తెలుసు బాహుబలి హీరోనే కదా అన్నారట. ప్రభాస్ ప్రభాస్‌గా కంటే బాహుబలి హీరోగానే అంతర్జాతీయంగా తెలుసని.. బాహుబలికి ముందు ఆయన మీడియం రేంజ్ హీరో అని.. బాహుబలితో రాజమౌళి ఆయన్ను ప్యాన్ ఇండియా స్టార్‌ని చేసారని అన్నారు. ఇది ఫ్యాన్స్‌కు రుచించలేదు. తమ హీరోను మీడియం రేంజ్ స్టార్ అనడం.. ప్రభాస్ పేరు ఎవరికీ తెలీదు బాహుబలి హీరోగానే తెలుసు అనడంతో వారు హర్ట్ అయ్యారు. దీనిపై మారుతి నుంచి ఎలాంటి అపాలజీ వీడియో కానీ మెసేజ్ కానీ రాలేదు.





