Viral News: దారుణం.. ఓ మహిళ తాను ఉంటున్న హోటల్‌లోని తన గదిలోకి వెళ్లబోయి వేరే గది తలుపు తట్టే సరికి ఆమె పట్ల సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ 30 ఏళ్ల మహిళ తన ఫ్రెండ్ డబ్బు ఇస్తాను అంటే ఛత్రపతి శంభాజీ నగర్‌లోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఓ హోటల్‌లో గది తీసుకుంది. కాసేపటి తర్వాత తన ఫ్రెండ్‌కి ఫోన్ చేయడానికి బయటికి వెళ్లింది. తిరిగి హోటల్‌కి వెళ్లి తాను ఉంటున్న 105 గదికి కాకుండా పొరపాటున 205కి వెళ్లి తలుపు తీసేందుకు యత్నించింది. లోపల ఎవరో ఉన్నట్లు అనిపిస్తే తలుపు తట్టింది.
తీరా డోర్ ఓపెన్ చేయగా.. ముగ్గురు యువకులు ఫుల్లుగా తాగేసి ఉన్నారు. ఆ అమ్మాయి పొరపాటున నా గది అనుకుని వచ్చాను అని వెళ్లబోతుంటే ఆమె నోరు నొక్కేసి లోపలికి లాక్కెళ్లారు. ఉదయం 3 వరకు ఆమె పట్ల అత్యాచారం చేసారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి తప్పించుకుని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే పారిపోవాలని చూసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





