KTR: రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. తెలంగాణ భవన్‌లో ఈరోజు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన KTR వివరించిన విషయాలు ఇవీ..
రేవంత్ ఇంట్లో మహిళలు, పిల్లలు, మనమడి గురించి నేను మాట్లాడను
కుటుంబ సభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయను
కేసీఆర్ రేపు అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారు
లోకల్ బాడీ ఎన్నికల తర్వాత BRS మెంబర్షిప్
రేవంత్ సర్కార్‌కు హనీమూన్ ముగిసింది, KCR ప్రజల్లోకి వస్తారు
KCR బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం
కాంగ్రెస్ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి BRSలోనే ఉన్నామనటం పెద్ద కామెడీ
రేవంత్ చెప్పే 66 శాతం నిజమైతే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్‌కు రావాలి
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాలేదు
నా నాయకత్వంలో 32 జడ్పీలు, 136 మున్సిపాలిటీలు గెలిచాం
రేవంత్ సీఎం అయ్యాక సొంత పార్లమెంట్ సీటే గెలిపించలేకపోయారు
నేను ఐరన్ లెగ్ కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్‌లు
పంచాయతీ ఫలితాల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవు
ముందుగా మున్సిపల్ ఎన్నికలే
గ్రేటర్ విలీనం సక్రమంగా జరగలేదు
గ్రేటర్‌ను మూడు కార్పోరేషన్లు చేయాలన్నది రేవంత్ ఆలోచన
గ్రేటర్ ఎన్నికలపై సీఎంకు స్పష్టత లేదు
2028లో BRS అధికారంలోకి రావడం పక్కా
ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని రేవంత్‌కు అర్థమైంది
పంచాయతీ ఫలితాలే రేవంత్ పాలనకు సూచిక
పరిశ్రమలు ఆంధ్రకు వెళ్లిపోతున్నాయి
విరూపాక్ష కంపెనీ కర్నూలుకు వెళ్లింది
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురు చూస్తున్నారు
42 శాతం రిజర్వేషన్లు పార్టీగా ఇవ్వమని చెప్పే హక్కు రేవంత్‌కు లేదు
పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీలో 30 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం
మార్కెట్ యార్డులు బీసీలకు ఇచ్చింది మేమే
రాజకీయాలు వేరు, విద్య ఉపాధిలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు
తెలంగాణలో కాంగ్రెస్,BJPలకు లోపాయికారి ఒప్పందం ఉంది.
రేవంత్ ఒక కాలు కాంగ్రెస్‌లో, ఒక కాలు BJPలో ఉంది.
2028లో BRS తిరిగి అధికారంలోకి వస్తుంది





