Sivaji: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి వచ్చిన కలెక్షన్ల కంటే ట్రోల్స్, మీమ్సే ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. చూస్తున్నాం కదా అని అసలు లాజిక్ లేని పొంతన లేని సినిమాలను ముఖాన కొడుతున్నారంటూ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌పై చాలా మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వారిలో బాలయ్య అభిమానులు కూడా ఉన్నారు.
ఇక బోయతో సినిమా వద్దు అంటూ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు శివాజీ అఖండ 2 సినిమాపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. మార్వెల్ సూపర్ హీరో అయిన హల్క్ అంత పెద్దగా మారిపోతే ప్రజలు నోరెళ్లబెట్టి చూసినప్పుడు అఖండ 2లో బాలయ్యకు ఉన్న పవర్స్ చూసి ఎందుకు లాజిక్స్ అడుగుతున్నారు అని శివాజీ మండిపడ్డారు. కొన్నింటికి లాజిక్ అవసరం లేదని.. అందులోనూ బాలయ్య ఏం చేసినా సరదాగా ఉంటుందని అన్నారు.
మీరు చెప్పింది నిజమే శివాజీ గారూ.. కాకపోతే హల్క్ అంత పెద్దగా మారిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను డైరెక్టర్ చాలా కన్విన్సింగ్‌గా చూపించారు. అఖండ 2లో అలాంటివేమీ లేవు. అది గమనించాలి మీరు.





