Russia Ukraine War Budget: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సార్లు కలగజేసుకుని యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నప్పటికీ ఆయన ప్రయత్నాలు విఫలమై విసిగిపోయి ఉన్నాడు. ఇంక నా వల్ల కాదు.. యుద్ధాన్ని ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే అని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వివరాలను బయటపెట్టారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి అయిన ఖర్చు వివరాలను ప్రకటించారు.
ఇలాంటి వివరాలను క్రెమ్లిన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇంతకీ రష్యాకు అయిన ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాలా ఒక లక్ష 23 వేల ఐదు వందల అరవై కోట్లు (1,23,56,08,48,00,000 ). సింపుల్‌గా చెప్పాలంటే.. లక్ష కోట్లకు పైగానే ఖర్చు అయ్యిందట. ఈ మొత్తం రష్యా GDPలో 5.1 శాతం ఉంటుందట. దీనిని మిలిటరీ బడ్జెట్ అంటారు. ప్రపంచం మొత్తంలో అత్యధిక మిలిటరీ బడ్జెట్‌ను కేటాయించేది అమెరికా అని చెప్తుంటారు. అమెరికా వెచ్చించే మిలిటరీ బడ్జెట్ ఆ దేశ GDPలో 3.5 శాతం ఉంటుంది. ఇదే అత్యధికంగా భావిస్తారు. కానీ రష్యా దీనిని మించిపోయింది. దీనర్థం ఏంటంటే.. రష్యా ఆర్థిక వ్యవస్థ మొత్తం యుద్ధానికే సరిపోతోంది. మెరుగైన మౌళిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్యా వ్యవస్థపై మాత్రం ఎలాంటి ఖర్చును ఆ దేశం భరించడంలేదు.





