Pawan Kalyan: OG సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… OG సినిమా దర్శకుడు సుజీత్‌కు రేంజ్ రోవర్ డిఫెండర్ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. చాలా మంది సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో పవన్ సుజీత్‌కు ఈ కారు కానుకగా ఇచ్చారని అనుకున్నారు. అయితే.. అసలు కారణం ఇప్పుడు బయటపడింది. OG సినిమాలోని కొంత భాగం షూటింగ్ జపాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ముందు బడ్జెట్ సమస్యల వల్ల జపాన్ సెట్స్‌ను హైదరాబాద్‌లోనే వేసి తీయాలనుకున్నారట.
కానీ సినిమాలో జపాన్‌లో తీసిన సీన్స్ ముఖ్యమని భావించిన సుజీత్.. తన వద్ద ఆల్రెడీ ఉన్న రేంజ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేసి మరీ ఆ పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసాడట. ఈ విషయం ఓజీ సినిమా డబ్బింగ్ సమయంలో పవన్ దృష్టికి రావడంతో ఆయన ఇంప్రెస్ అయ్యి.. ఏ కారైతే సుజీత్ అమ్మేసాడో అదే కారును కానుకగా ఇచ్చాడట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ కారుకు ఇద్దరూ కలిసే EMIలు కడుతున్నారు.





