Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్ట్ దాడిలో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. 2003 అక్టోబర్ 1న ఆయన ప్రయాణిస్తున్న కారు అలిపిరి వద్దకు చేరుకోగానే క్లేమోర్ పేలుడు పదార్థాలకు తగిలి పేలుళ్లు సంభవించాయి. ఆయన కారు ఓ ఇంటిని ఢీకొని ఎగిరిపడింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో గాయాలతో చంద్రబాబు బతికి బయటపడ్డారు.
ఈ అంశం గురించి చంద్రబాబు ఓ కార్యక్రమంలో మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆరోజు తాను పేలుడు ఘటనలో చనిపోతే శ్రీవారికి అపవాద వస్తుందని ఆయనే దిగొచ్చి కాపాడారని అన్నారు. అసలు అంత పెద్ద ఘటన నుంచి ఎలా బయటపడ్డానో తనకే తెలీదని తెలిపారు. గాయాలతో ఉన్నప్పటికీ దాడి చేసిన వారిని పట్టుకోండి తనకు రక్షణ అవసరం లేదని పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని.. అన్ని గాయాలలో కూడా తన డ్యూటీ మరవలేదు అంటే అది తన పట్టుదల అని పేర్కొన్నారు.





