Pakistan India Issue: లష్కరే తైబాకి చెందిన అబ్దుల్ రౌఫ్ అనే కరుడుగట్టిన ఉగ్రవాది జాతీయ టీవీతో మాట్లాడుతూ భారత దేశంపై విషంకక్కడం సంచలనంగా మారింది. అబ్దుల్ రౌఫ్‌ను అమెరికా లష్కరేకి చెందిన ఉగ్రవాదిగా గుర్తిస్తూ అతన్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు వీడు ఓ జాతీయ టీవీ ఇంటర్వ్యూలో కూర్చుని కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు.
“” కశ్మీర్‌ని వదిలేసామని ఎవరు చెప్పారు. కశ్మీర్ ఎప్పుడూ మాదే. ప్రిపేర్ అవుతున్నాం. ఈసారి మేం ఢిల్లీని టార్గెట్ చేస్తాం. ఈసారి భారత్‌ను రఫేల్, S-400లు కూడా కాపాడలేవు. ఈసారి మేం చేసే దాడికి భారత్ మళ్లీ మాపై దాడి చేయడానికి 50 ఏళ్లు పడుతుంది “” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంకొన్ని రోజులు ఆపరేషన్ సింధూర్ కొనసాగి ఉంటే ఇలాంటి చిన్న చిన్న చీడపురుగులు కూడా చచ్చేవని కొందరు అంటుంటే… ముందు అడుక్కు తింటున్న పాక్‌ని కాపాడుకో అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.





