Rujuta Diwekar: మెనోపాజ్ దశ అనగానే ఆడవాళ్లు ఇక ముసలివాళ్లు అయిపోయినట్లే అని భావిస్తున్న కొందరు మగ ఇన్‌ఫ్లుయెన్సర్లపై మండిపడ్డారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివాకర్. ఈమె బాలీవుడ్ నటి కరీనా కపూర్‌తో పాటు చాలా మంది సెలబ్రిటీలకు పర్సనల్ న్యూట్రిషనిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా మంది మగ ఇన్‌ఫ్లుయన్సర్లు ఆడవారిలో శారీరకంగా, మానసికంగా జరిగే ప్రక్రియల గురించి చాలా బాగా తెలిసినట్లు ఏది పడితే అది వాగుతున్నారని అన్నారు. మెనోపాజ్ గురించి చెప్తూ ఆ స్టేజ్‌లో ఆడవారు ఇక బామ్మలుగా మారిపోతారన్న అపోహలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి వారి మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని రుతూజా మహిళలకు సందేశం ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
“” మెనోపాజ్ దశ రాగానే మీ జీవితం అయిపోనట్లే అనుకోకండి. మీరు అప్పటివరకు మీ గురించి ఎలా ఆలోచించుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అవే జాగ్రత్తలు మెనోపాజ్ దశ తర్వాత కూడా తీసుకోవాలి. ప్రతి వయసులోనూ మహిళ తన గురించి తన ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాల్సిందే. మెనోపాజ్ దశ రాగానే మీ శృంగార వాంఛలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పని లేదు. మీ ఇష్టం మీది. ఎవరో చెప్పారని మీరు మీరు హద్దులు ఏర్పరచుకోకండి. జీవితంలో సరైన విషయాన్ని ఎంచుకోవడానికి వయసు అడ్డంకి కాకూడదు. మీ కోరికలు, ఇష్టాలు ఏవైనా సరే గిల్ట్ అనేది లేకుండా నెరవేర్చుకోండి “” అని తెలిపారు.





