Delhi Blast: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీని వణికించిన కారు బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతోంది. ఈ పేలుడు ఘటనలో హస్తం ఉన్న కీలక వ్యక్తి ఉమర్ నబీ చెప్పిన సమాచారం ప్రకారం.. తాము హమాస్ తరహా దాడి చేయాలని అనుకున్నారట.
ఇందుకోసం డ్రోన్స్‌కి బాంబులు అమర్చి ఎగరేయాలనుకున్నామని.. రాకెట్లు నిర్మించాలనుకున్నామని తెలిపాడు. వీటన్నింటినీ నవంబర్ 10 లోపే ప్రయోగించాలనుకున్నారు. హమాస్ కూడా ఇజ్రాయెల్‌పై ఇదే మాదిరి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉమర్ ఉన్ నబి అనే వ్యక్తిని సూసైడ్ బాంబర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో కీలక వ్యక్తి పేరు జసీర్ బిలాల్ వనీ అలియాస్ డ్యానిష్. ఇతన్ని జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్స్, రాకెట్లు తయారుచేసేందుకు ఉమర్‌కి టెక్నికల్ సాయం చేసింది ఇతనే.
ALSO READ: Mehbooba Mufti: ఎర్రకోట పేలుడుపై ముఫ్తీ షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు ఉగ్రమూకలు కూడా మోడ్రన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాయి. గతంలో వాహనాల్లో బాంబులు పెట్టి పేల్చేవారు. లేదా ఒంటికి బాంబులు తగిలించుకుని తమని తాము పేల్చుకునేవారు. ఇప్పుడు అలా కాదు. డ్రోన్స్, రిమోట్ ఆయుధాలు, లాంగ్ డిస్టెన్స్ టెక్నాలజీ, ఆన్‌లైన్ సమాచారంతో అప్డేట్ అయ్యారు. ఇలాంటి వాటి వల్ల టెర్రర్ ఎటాక్స్‌ని ముందే గుర్తించడం కష్టం అవుతోంది.
మరి భారత్ ఎలా సన్నద్ధం అవుతోంది?
భారత్ ఇలాంటి ఉగ్ర కుట్రను ధీటుగా ముందే గ్రహించి ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్, డ్రోన్ జామర్స్, స్పెషల్ స్ట్రైక్ యూనిట్స్‌తో సన్నద్ధం అవడంతో పాటు సరిహద్దులో నిఘాను మరింత పెంచింది.






