Renu Desai: నటి రేణూ దేశాయ్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ఆమె మద్దతు మాత్రం భారతీయ జనతా పార్టీకి మాత్రమే అని ఎప్పుడో చెప్పారు. అందుకే తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆయనకే మద్దతు తెలిపారు. ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశాలపై ఆమె సోషల్ మీడియాలో గళం ఎత్తుతుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అభిమానం చూపుతుంటారు.
ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (NDA) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే బిహార్‌లో NDAకు మద్దతు మరింత పెరిగింది. ఈ ఎన్నికల ఫలితాలపై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఓటు చోరీలకు పాల్పడి భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచిందని అంటుంటే.. మరికొందరు ఈవీఎంలను హ్యాక్ చేసి ఎన్డీయే కూటమి గెలిచిందని అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
“” ఆల్రెడీ మోసం చేస్తున్నారు అని సగం మంది దేశ ప్రజలకు ముందే తెలిసినప్పుడు వచ్చే విజయంలో కిక్ ఏముంటుంది? “” అని ట్వీట్ చేసాడు. దీనికి ఒక కశ్మీరీ ముస్లిం రిప్లై కూడా ఇచ్చాడు. “” నేను కశ్మీర్‌కి చెందిన ముస్లింను. నేను భారతీయ జనతా పార్టీ భావాలకు వ్యతిరేకిని. కానీ మీరు మాత్రం ఒక మూర్ఖపు ప్రపంచంలో బతుకుతున్నారు. మీరు కేవలం కులాలకు ప్రాధాన్యత ఇస్తూ రిజర్వేషన్లు కల్పిస్తుంటారే తప్ప రాష్ట్రాలకు ఎలాంటి మంచి చేసింది లేదు. నువ్వు కాంగ్రెస్‌కి ఎక్కువ మద్దతు ఇస్తావు కదా? నేను కాంగ్రెస్‌కి ఓటు వేయను. అసలు కాంగ్రెస్ ఇన్నేళ్ల పాలనలో చేసిన మంచేంటో చెప్పు“” అని సమాధానం ఇవ్వడం వైరల్‌గా మారింది. ఈ సంభాషణను రేణూ స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. “” ఈ ధృవ్ రాఠీ అనే వ్యక్తి కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయడు? కేవలం భారతీయ జనతా పార్టీనే ఎందుకు వ్యతిరేకిస్తుంటాడు? ఆ పార్టీని నమ్మే మాలాంటి వాళ్లను మాత్రం అంధ భక్తులు అంటుంటాడు “” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.





