RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ విషయమనే చెప్పాలి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇక RCB IPL మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది.
ఆ ఆనందంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేయడం.. ఆ స్టేడియంకు లక్షలాది మంది అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దాంతో ఇక చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఏర్పాటుచేయడం వృథా అని మేనేజ్‌మెంట్ నిర్ణయించిందట. ఇక నుంచి RCB ఆడాల్సిందిన అన్ని మ్యాచ్‌లను పుణె MCA స్టేడియంకు మార్చనున్నారు. 2026 IPLలో RCB పుణె MCA స్టేడియంలోనే ఆడబోతోందని విశ్వసనీయవర్గాల సమాచారం.
చిన్నస్వామి స్టేడియం బెంగళూరు నగర నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఏ పబ్లిక్ ఈవెంట్ నిర్వహించినా.. మ్యాచ్‌లు నిర్వహించినా ట్రాఫిక్ ఇబ్బందులు ఇంకా దారుణంగా ఉంటున్నాయట. కర్ణాటక ప్రభుత్వం కూడా చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడమే మంచిది అనే అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.





