Allu Sirish: అల్లు కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడైన అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. నయనిక అనే అమ్మాయితో ఆయన మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే.. చాలా మంది మీ లవ్ ట్రాక్ ఎలా మొదలైందన్నా అంటూ కామెంట్స్ చేస్తుండడంతో మొత్తానికి శిరీష్ ఆ స్టోరీ చెప్పేసారు. చాలా మంది నయనిక అల్లు అర్జున్ భార్య స్నేహ స్నేహితురాలు అనుకున్నారు. కాదు.
ఆమె నటుడు నితిన్ భార్య శాలిని బెస్ట్ ఫ్రెండ్. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం జరిగిన తర్వాత వీరి కోసమని నితిన్, శాలినిలు ఓ చిన్న పార్టీ నిర్వహించారట. ఈ పార్టీకి నయనికను కూడా ఆహ్వానించారు. ఆ సమయంలోనే శిరీష్, నయనిక కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అలా తెలిసో తెలీకో నితిన్ తన పెళ్లి పెద్దయ్యారు అని శిరీష్ తెలిపారు. నయనిక రెడ్డి సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ చేసారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఎంఎస్సీ చేసారు.







