Virat Kohli Retirement: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ODIకు రిటైర్మెంట్ పలకనున్నాడా? కొన్ని రోజులుగా అభిమానులు ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు. 2027 ప్రపంచ కప్ వరకు ఆడు విరాట్ అంటూ లక్షల్లో విరాట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన ODI సిరీస్‌లో విరాట్ డకౌట్ అవడమే ఈ చర్చకు దారి తీసింది. ఔట్ అయిన తర్వాత విరాట్ అభిమానులను ఉద్దేశిస్తూ సంజ్ఞలు చేయడంతో ఆయన ODIకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని అందికీ అర్థమైపోయింది.
ఈ మ్యాచ్ చూసేందుకు సిడ్నీకి ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కూడా వచ్చాడు. వార్నర్ కేవలం విరాట్ కోసమే ఆ రోజు స్టేడియంకు వచ్చాడట. మూడో ODIకి ముందు వార్నర్ విరాట్‌ను మైదానంలో కలిసాడు. ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత విరాట్ ఇక తాను ODI నుంచి రిటైర్ అవుతానని వార్నర్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ మాట వినగానే అప్పుడే వద్దు అని వార్నర్ విరాట్‌కు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ODI సిరీస్ ముగిసాక కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడో లేక వార్నర్ చెప్పినట్లు కొన్ని రోజుల పాటు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.





