Naga Vamsi జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2కి ఆశించినంత స్థాయిలో ప్రాఫిట్స్ రాకపోవడంపై స్పందించారు ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత నాగవంశీ. వార్ 2 సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరుగాంచింది. ఈ సంస్థ అధినేత ఆదిత్య చోప్రాను పెద్ద నిర్మాత కావడంతో తనతో పాటు ఎన్టీఆర్ కూడా ఆయన్ను నమ్మి సినిమాను ఒప్పుకున్నారని నాగవంశీ అన్నారు. కానీ అదే తమకు బెడిసికొడుతుందని అనుకోలేదని.. అది నేరుగా తెలుగు సినిమా కాకుండా హిందీ సినిమాతో దొరకడం కాస్త సంతోషించాల్సిన విషయం అని అన్నారు.
“” అందరం తప్పులు చేస్తాం. ఆదిత్య చోప్రా ఇండియాలోనే పెద్ద నిర్మాత. అంత పెద్ద మనిషి సినిమా తీస్తున్నాడంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయనే ఆశించి నేను తారక్ గారు ఆయన్ను నమ్మాం. కానీ ఇలా బెడిసికొట్టి దొరికిపోయాం. అది మనం నేరుగా తీసిన సినిమా కాదు. కాబట్టి ఇట్స్ ఓకే “” అని అన్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ అధినేత అయిన నాగవంశీ తన బ్యానర్‌లో వస్తున్న మాస్ జాతర (Mass Jathara) సినిమా ప్రమోషన్స్‌లో ఈ వ్యాఖ్యలను చేసారు. ఆయన వార్ 2 లాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాస్ మహారాజా రవితేజ నా కొడకల్లారా రాకపోతే చెప్తా మీ పని అని వార్ 2 సమయంలో నాగవంశీ అన్న మాటను సరదాగా గుర్తుచేసారు.