Nara Lokesh పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
నిజంగా పవన్ అభిమానులకు రేపు (సెప్టెంబర్ 25) ఓ పండగనే చెప్పాలి. ఎందుకంటే పవన్‌ను ఓ గ్యాంగ్‌స్టర్‌గా, స్టైలిష్ లుక్‌లో చూసి చాలా సంవత్సరాలు అవుతోంది. పైగా హరిహర వీరమల్లు లాంటి రాడ్డు సినిమా తర్వాత అభిమానులకు కాస్త ఊరట కలిగించే సినిమా ఇదే అని చెప్పాలి. పైగా ఇందులో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. దర్శకుడు సుజీత్‌కి ఇది మూడో సినిమా. ఆయన కూడా పవన్‌కు స్వయాన అభిమానే కావడంతో తన అభిమాన నటుడిని తెరపై ఎలా చూడాలనుకున్నాడో అలాగే ఊహించుకుని ఈ కథ రాసుకున్నాడు. ఇక అభిమాని సినిమా తీస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా..! ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.