Ambati Rambabu: టీవీ 5 అధినేత బీఆర్ నాయుడు (BR Naidu) బ్రోకర్ పనులు చేస్తేనే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి లభించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు. ఎన్నికల సమయం దగ్గరపడుతోందని తెలిసినప్పటి నుంచి టీవీ 5 తెలుగు దేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఒకటే భజన చేసిందని.. దీని వెనుక టీవీ5 యజమాని బీఆర్ నాయుడు ఉన్నాడని అన్నారు.
ఆయన చేసిన భజన వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడని అనుకుని బీఆర్ నాయుడుకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి ఇచ్చినట్లు కీలక కామెంట్స్ చేసారు. ఆయన ఛైర్మన్ అయిన వెంటనే తిరుమలలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడటం.. వందలాది గోవులు చనిపోవడం జరిగాయని అన్నారు. బ్రోకర్ పనులు చేసి తిరుమల లాంటి క్షేత్రానికి ఛైర్మన్ అయిన బీఆర్ నాయుడు అవసరంగా తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా ఇప్పటికైనా చక్కగా నడుచుకోవాలని.. మాట్లాడటం నేర్చుకోవాలని అన్నారు. అలా కాకుండా పదవిలో ఉన్నాం కదా.. ఏం జరిగినా ప్రభుత్వంలో ఉన్నవారు చూసుకుంటారని నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని.. దానికి తగ్గ పర్యావసనాలు ఉంటాయని హెచ్చరించారు.