Rohit Sharma: ODI రిటైర్మెంట్‌ను ప్రకటించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ని ఖుష్ చేసే వార్త చెప్పాడు. 2025 IPLలో ముందు ఎగ్జిట్ అయింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టీమే. హార్దిక్ పాండ్యను (Hardik Pandya) కెప్టెన్‌ని చేయడం.. ఆ తర్వాత అన్ని టీమ్స్‌ల నుంచి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ త్వరగా ఎగ్జిట్ అవడం అనేది రోహిత్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా మింగుడు పడని విషయం.
రోహిత్ శర్మ ఎప్పుడు ఏ మ్యాచ్‌తో ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రోహిత్ అభిమానులకు మంచి వార్త అందించబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరగబోయే ఇండియా A మ్యాచెస్‌లో రోహిత్ ఆడబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న గ్రీన్ పార్క్‌లో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరగబోయే మ్యాచ్‌లలో హిట్ మ్యాన్ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది.
ఈ ఇండియా A మ్యాచ్ అనేది ఆస్ట్రేలియా టూర్ మ్యాచ్‌కి ప్రిపరేషన్ లాంటిది. ఈ టూర్ మ్యాచ్ అక్టోబర్ 19 నుంచి 25 మధ్యలో జరగనుంది. 38 ఏళ్ల రోహిత్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవనున్నట్లు తెలుస్తోంది. 2017 ODI వరల్డ్ కప్‌లో రోహిత్ ఆడటం లేదన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ ఆస్ట్రేలియా సిరీసే రోహిత్ ఆడబోయే చివరి చివరి అంతర్జాతీయ సిరీస్ అని తెలుస్తోంది. ODI నుంచి రోహిత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్‌లుగా శ్రేయస్ అయ్యర్ కానీ శుభ్‌మన్ గిల్‌లు కానీ వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇండియా A సిరీస్‌లో ఎందుకు రోహిత్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నాడంటే ఆస్ట్రేలియా సిరీస్‌లో చివరిసారిగా తన సత్తా చాటుకునేందుకు. తన పని అయిపోయింది అన్నవాళ్ల నోరు మూయించేందుకు. అందుకు తగ్గట్టుగానే రోహిత్ మ్యాచ్‌కు ఫాంలో ఉండేలా ప్రిపేర్ అవుతున్నాడు.