Viral News: శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా?
నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా?
మేము నీ కొడుకులం కాదా?
అంటూ దేవుడికి లేఖ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా? మేము నీ కొడుకులం కాదా? అంటూ దేవుడిని నిలదీస్తూ రోహిత్ అనే యువకుడు లేఖ రాసి ఆయనతోనే నేరుగా తేల్చుకుంటానంటూ ప్రాణాలు తీసుకున్నాడు.
వేములవాడకు చెందిన దీటి రోహిత్(25) అనే వ్యక్తి ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్నాడు. డాక్టర్ అవ్వాలనే తన కల నెరవేరక ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటుండేవాడట. స్నేహితులతో కలవడని.. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ దిగాలుగా ఉండేవాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
ఇక జీవితంలో ఎలాంటి మార్పు రాదని.. తాను కలలు కన్న వృత్తిలో ఉండలేనేమో అన్న బెంగతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ లేఖలో ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక మాత్రం నెరవేరిందని, చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ అంటూ పేర్కొన్నాడు.