Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను అందుకుంది. ఈ విజయం నేపథ్యంలో బెంగళూరులో ఈ రోజు ఆర్సీబీ జట్టును ప్రభుత్వం అధికారికంగా సత్కరించింది. అయితే.. ఆర్సీబీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో విరాట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ విజయాన్ని తాను తన బెంగళూరు అమ్మాయి అయిన అనుష్క శర్మకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అనుష్క చాలా మటుకు బెంగళూరులోనే పెరిగిందని.. తాను ఈ కప్ కోసం 18 ఏళ్లు ఎదురుచూస్తే.. అనుష్క 11 ఏళ్లు ఎదురుచూసిందని.. కాబట్టి ఈ విజయం ఇద్దరికీ ఎంతో కీలకమని తెలిపారు.