Vijaya Sai Reddy: వైసీపీలో భయం మొదలైంది. పార్టీ నుంచి వైదొలగిన విజయసాయి రెడ్డి విషయంలో గాబరా పడుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఆ పార్టీ గతంలో చేసిన నేరాలు, కుట్రలు వంటివి బయటపెడుతుంటారు. ఇది ఏ రాజకీయ నాయకుడైనా చేసే పనే. విజయసాయి రెడ్డి విషయంలోనూ ఇదే జరుగుతోంది.
గతంలో కాకినాడ సముద్ర పోర్టు స్కాంలో విజయసాయి రెడ్డి పేరు వినిపించడంతో.. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి హస్తం ఉందని త్వరలో మిగతా విషయాలు వెల్లడిస్తానని అన్నారు. వైసీపీ హయాంలో కాకినాడ సముద్ర పోర్టు, స్పెషల్ ఎకనామిక్ జోన్లలో భారీ కుంభకోణం కూటమి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తోంది
ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. ఇటీవల మద్యం కుంభకోణం బయటపడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడి విజయసాయి రెడ్డికి నోటీసులు అందించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. అయితే.. ఈ మద్యం కుంభకోణం అంతా వెనకుండి నడిపించింది రాజ్ కసిరెడ్డి అని విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్ కసిరెడ్డి ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువే.
జగన్ హయాంలో రాజ్ ఊటీ సలహాదారుగా పనిచేసారు. ప్రస్తుతం రాజ్ పరారీలో ఉన్నాడు. దాంతో విజయసాయి ఇంకెన్ని విషయాలు బయటపెడతాడో అని వైసీపీలో భయం మొదలైంది. ఈ విషయాల్లోనే కాదు.. పార్టీలో ఏ2గా ఉన్న విజయసాయి.. జగన్‌పై ఉన్న 10 సీబీఐ కేసులు, 11 ఈడీ కేసుల్లో కూడా సూత్రధారే అని టాక్ ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో కూడా విజయసాయి రెడ్డి దగ్గర కీలక సమాచారం ఉందట. ఇక విజయసాయి రెడ్డి ఆల్రెడీ కూటమి నేతలను రహస్యంగా కలుస్తున్నారని.. త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.