Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను తొలగించాలని అంటున్నారు మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్. నిన్న ముంబై ఇండియన్స్ లఖ్‌నౌ సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. 18వ ఓవర్‌లో తిలక్ వర్మను తప్పించడంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అప్పటికే తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. ఆ తర్వాత తిలక్ స్థానంలో మిషెల్ సాంట్నర్‌ను పంపించారు కానీ అతను పేలవంగానే ఆడాడు.
తిలక్ సరిగ్గా ఆడటంలేదని అతన్ని ఆట మధ్య నుంచి తీసేసినప్పుడు రెండేళ్లుగా పేలవంగా ఆడుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యను కూడా తొలగించాల్సిందే అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తిలక్ వర్మను తప్పించడంపై హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్‌లు కూడా వ్యతిరేకించారు. మరోపక్క లఖ్‌నౌ సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కెప్టెన్సీపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యాక్సిడెంట్ తర్వాత కోలుకుని ఇప్పుడిప్పుడే ఆటకు అలవాటుపడుతున్న రిషభ్‌ను లఖ్‌నౌ సూపర్ జైంట్స్ రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది. IPL చరిత్రలోనే పంత్ ఖరీదైన ఆటగాడిగా నమోదయ్యాడు. ముంబై ఇండియన్స్‌పై కేవలం 2 పరుగులే తీసిన పంత్ విషయంలో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.