Bad Cholesterol Prevention Tips: వేసవి వస్తోంది. నిజానికి వేసవి ఆల్రెడీ వచ్చేసిందనే చెప్పాలి. వేసవి అంటే శరీరం విపరీతంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో మన గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది HDL .
అంటే హై డెన్సిటీ లైపోప్రొటీన్. మనకు HDL ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలిసేది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు. కాబట్టి.. ఓసారి ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించేసుకోండి. ఒకవేళ HDL కంటే LDL (లో డెన్సిటీ లైపోప్రొటీన్) ఎక్కువగా ఉందంటే.. గుండెకు హాని జరగబోతోందని అర్థం. అలాంటప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. సహజంగా మన ఒంట్లో నుంచి LDL పంపించేసి.. HDL పెంచుకునే టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. తిని పడుకోవడం.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల LDL ఈ పెరుగుతుంది.
కొవ్వు అనేది ఒంట్లో హార్మోన్స్‌ని, కణాలను తయారుచేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ కొవ్వు అనేది రెండు రకాలు. ఒకటి HDL, మరొకటి LDL. HDL రక్తంలోని అధిక కొవ్వును కరిగించేందుకు సాయపడుతుంది. LDL ఉన్నా మంచిదే కానీ ఎక్కువగా ఉంటే మాత్రం రక్తంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు మూసుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి.
చెడు కొవ్వు (LDL) ఎందుకొస్తుంది?
Bad Cholesterol Prevention Tips వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఒంట్లో ఈ చెడు కొవ్వు పేరుకుపోతుంది
వ్యాయామం చేయకపోయినా ఈ చెడు కొవ్వు పేరుకుపోతుంది.
కొందరికి వంశపారపర్యంగా ఈ సమస్య ఉంటుంది
ఊబకాయం, మధుమేహం ఉంటే LDL మరింత పెరుగుతుంది.
మరి ఈ చెడు కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి?
పుచ్చకాయ, టొమాటోలు, అవొకాడోలు, బెర్రీలు, ఆకుకూరలు, బాదం, వాల్నట్స్, గ్రీన్ టీ. ఇవన్నీ మీ ఆహారంలో భాగంగా చేర్చుకుంటే చెడు కొవ్వు దానంతట అదే కరిగిపోతుంది. మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. తగినంత వ్యాయామం కూడా చేయాలి. తీసుకున్న కేలొరీలు కరిగించకపోతే ఎంత ఆరోగ్యమైన ఆహారం తీసుకున్నా వృథానే అనేది గుర్తుంచుకోవాలి.