Rishabh Pant: ప్రముఖ క్రికెటర్ రిషభ్ పంత్‌కు 2022 డిసెంబర్‌లో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో అక్కడే ఉన్న రజత్ (Rajat) అనే వ్యక్తి వెంటనే పంత్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి అతని ప్రాణాలు కాపాడాడు. అయితే.. ఇప్పుడు రజత్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కారణం.. ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో వారు పెళ్లికి ఒప్పుకోకపోవడమే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన రజత్.. అదే ప్రాంతానికి చెందిన మను అనే 21 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. దాదాపు ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
అయితే వీరి వివాహానికి ఇద్దరి కుటుంబాలు ఒప్పుకోలేదు. పైగా ఇద్దరికీ వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారు. ఈ విషయం తెలుసుకుని ఇద్దరూ నిన్న రాత్రి విషం తాగారు. వీరిద్దరి కోసం వెతుకుతున్న కుటుంబీకులు ఓ ప్రాంతంలో కనిపించారు. ఇద్దరి నోట్లో నుంచి నురగ రావడం గమనించి వెంటనే ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే మను అప్పటికే చనిపోగా.. రజత్ పరిస్థితి సీరియస్‌గా మారింది. ప్రస్తుతం అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. చనిపోయిన మను తల్లిదండ్రులు.. తమ బిడ్డ చావుకు కారణం రజతే అని తమ బిడ్డను లేపుకుపోయి బలవంతంగా విషం తాగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
స్కూటీ కానుకగా ఇచ్చిన పంత్
Rishabh Pant 2022 డిసెంబర్‌లో పంత్ తన మెర్సిడిస్ కారులో రూర్కీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అటు వైపు నుంచి వెళ్తున్న రజత్ వెంటనే కారులో ఉన్న పంత్‌ను హాస్పిటల్‌కు తరలించాడు. అతను ప్రముఖ క్రికెటర్ రిషభ్ పంత్ అన్న విషయం కూడా రజత్‌కు తెలీదు. సమయానికి తనను హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడిన రజత్‌కు పంత్ కోలుకున్నాక ఓ స్కూటీని బహుమానంగా ఇచ్చాడు. ఇదే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదిస్తే సాయం చేస్తానని కూడా పంత్ మాటిచ్చాడు. అలాంటి రజత్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని ఎవ్వరూ ఊహించలేదు. అతను త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.