Fake QR Codes: డిజిటలైజేషన్ కారణంగా యావత్ భారతదేశం షాపుల్లో, షాపింగ్ మాల్స్‌లో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తోంది. గత రెండేళ్లలో ఈ డిజిటల్ పేమెంట్స్ శాతం మరీ పెరిగిపోయింది. ఇప్పుడు గ్రామాల్లో కూడా QR కోడ్స్ పెట్టేసి డిజిటల్ పేమెంట్స్ చేయించుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్ది స్కామర్లు కూడా అప్డేట్ అయిపోతున్నారు. మార్కెట్‌లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దానికి తగ్గట్టుగా స్కామ్స్ చేసేసి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ల విషయంలో దోపిడీ జరుగుతోంది. షాపుల్లో, మాల్స్‌లో వారి క్యూఆర్ కోడ్స్ దగ్గర స్కామర్లు తమ ఖాతాలో డబ్బులు పడేలా కోడ్‌లు మార్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షాపులు, పెట్రోల్ బంకుల్లో ఈ మోసాలు జరుగుతున్నాయి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. క్యూఆర్ కోడ్ నకిలీ అని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అదే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం.
సౌండ్ రావాల్సిందే
మనం ఎక్కడైనా పేమెంట్ చేస్తే.. ఆ డబ్బులు షాప్ యజమానికి పడినట్లు సౌండ్ రావాలి. ఎవరైనా పేమెంట్ చేసిన వెంటనే అలా సౌండ్ రాకపోతే క్యూఆర్ కోడ్ నకిలీదని అర్థం. (Fake QR Codes)
కోడ్‌పై పేరు వెరిఫై చేసుకోవాలి
QR కోడ్ కనిపించింది కదా అని వెంటనే స్కానర్ తీసేసి డబ్బులు కొట్టేయడం కాదు. ముందు ఆ క్యూఆర్ కోడ్‌పైన షాపు యజమాని పేరుందా? ఆ పేరు వారిదేనా అనేది అడిగి తెలుసుకోండి.
నకిలీ అని తెలిస్తే..
ఒకవేళ మీకు క్యూఆర్ కోడ్ తేడాగా అనిపించిందనుకోండి ఇలా చేయండి. మీ ఫోన్‌లో గూగుల్ లెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా ఆ కోడ్ సరైనదా కాదా అని తెలిసిపోతుంది. మీరు ఆ కోడ్‌ని గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే.. ఆ కోడ్‌కి సంబంధించిన యజమాని వివరాలు వస్తాయి. దాని ద్వారా మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు. (Fake QR Codes)