Saif Ali Khan Discharge: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఎట్టకేలకు ఈరోజు డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దుండగుడు చోరీకి వచ్చి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. సైఫ్‌కు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ఆయన వెన్నెముకలో చిన్న కత్తి ముక్క ఇరుక్కోవడంతో సర్జరీ చేసి విజయవంతంగా తొలగించారు. రెండు రోజుల పాటు హాస్పిటల్‌లోనే రెస్ట్ తీసుకున్న సైఫ్ ఈరోజు డిశ్చార్జి అయ్యారు. సైఫ్ విషయంలో ఇలాంటి ఘటన జరగడంతో ముంబై మరింత అప్రమత్తమైంది. ముంబైలో నివసించే సెలబ్రిటీలంతా ఓసారి సెక్యూరిటీని పరిశీలించి మార్పులు చేర్పులు చేసుకున్నారు. సెక్యూరిటీని మూడింతలు పెంచుకున్నారు.
అయితే.. ప్రస్తుతం సైఫ్ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని ఆయన భార్య కరీనా కపూర్ తొలగించింది. సైఫ్‌పై దాడి జరిగిందంటే అందుకు ఒక రకంగా తన ఇంటి ముందున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒక కారణమే. మీడియాకు కంట పడకుండా కరీనా వారిని లోపలికి పిలిచి గట్టిగానే క్లాస్ పీకింది. వారిని తక్షిణమే విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇచ్చేసి కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటుచేసుకోవాలని అనుకుంది.ఈ నేపథ్యంలో నటుడు రోనిత్ రాయ్ సైఫ్, కరీనాలకు బాసటగా నిలిచారు. (Saif Ali Khan Discharge)
సెక్యూరిటీ పని నాకు అప్పగించి మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అని హామీ ఇచ్చారు. రోనిత్ రాయ్‌కు ముంబైలో ఓ పెద్ద హౌస్ కీపింగ్ ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు సెక్యూరిటీని నియమించుకుంటున్నారు. వారి సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయని అంటున్నారు. దాంతో సైఫ్ రోనిత్ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీని పిలిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు సైఫ్ డిశ్చార్జి అయిన నేపథ్యంలో రోనిత్ రాయ్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. సెక్యూరిటీ విషయం మొత్తం తాను చూసుకుంటానని మాటిచ్చారు. ఇంతకీ రోనిత్ రాయ్ అంటే ఎవరో కాదండీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమాలో విలన్‌గా నటించిన వ్యక్తే. అయితే తాను సైఫ్‌కి సెక్యూరిటీ కల్పిస్తున్న మాట నిజమే కానీ ఎంత మందిని నియమిస్తున్నారు అనే వివరాలను మాత్రం వెల్లడించలేనని అది కాన్ఫిడెన్షియల్‌గా ఉంచాలని రోనిత్ తెలిపారు. (Saif Ali Khan Discharge)