Viral News: నేరాల విషయంలో కోర్టులు ఆడవాళ్లను ఒకలా మగవారికి ఒకలా చూస్తుంటుందనే వాదన ఉంది. కానీ చట్టం ముందు ఎవ్వరైనా ఒక్కటే అని నిరూపించింది కేరళ హైకోర్టు. పై ఫోటోలో కనిపిస్తున్న జంటను చూసారుగా. వారిద్దరూ కేరళకు చెందిన ప్రేమికులు. అబ్బాయి పేరు షరోన్ రాజ్, అమ్మాయి పేరు గ్రీష్మ. వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. 2022లో ఏమైందో ఏమో కానీ.. గ్రీష్మ రాజ్‌కు విషం కలిపిన కూల్‌డ్రింక్ తాగించింది. దాంతో అతను చనిపోయాడు. అప్పటి నుంచి కోర్టులో నానుతున్న ఈ కేసులో ఈరోజే కీలక తీర్పు వెల్లడైంది. ఇంత దారుణానికి పాల్పడిన గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది. ఆమెకు సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రీష్మ షరోన్‌ను ప్రేమలోకి దింపింది. పాపం అతను నిజంగానే ప్రేమించాడు. అవసరం తీరాక గ్రీష్మ షరోన్‌ను వదిలించుకోవాలనుకుంది. బ్రేకప్ చెప్తే అతను ఒప్పుకోడని తెలిసి చంపాలనుకుంది. ఇందుకోసం తన మామ నిర్మల్ కుమార్ సాయం తీసుకుంది. అలా కూల్‌డ్రింక్‌లో విషం పెట్టి తాగించింది. అతను హాస్పిటల్‌లో చనిపోవడానికి ముందు కూడా గ్రీష్మ అంటే తనకు ఇష్టమని.. ఆమెను ఎవ్వరూ ఏమీ చేయకండి అని అన్నాడట. గ్రీష్మను అరెస్ట్ చేసాక కోర్టులో పలుమార్లు షరోన్ తనను కొట్టేందుకు యత్నించాడని అందుకే తప్పించుకునేందుకు చంపేసానని చెప్పింది. కానీ ఆమె మాటల్లో ఎక్కడా పొంతన లేదని న్యాయమూర్తికి అర్థమైంది. ఇలాంటి ఆడది బతికి కూడా సమాజానికి ఉపయోగం లేదని భావించిన కోర్టు ఈరోజు ఆమెకు ఉరిశిక్ష విధించింది. తీర్పు విని షరోన్ తల్లి ఎంతో ఆనందించింది. ఇంత కాలం కన్నీళ్లతో దేవుడిని మొక్కుకున్నానని.. ఆ దేవుడు న్యాయమూర్తి రూపంలో వచ్చి తన బిడ్డకు న్యాయం చేసాడని తెలిపింది.